: భారత ఐటీ ఉద్యోగులకు 'బ్యాడ్ న్యూస్'!


రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవి బరిలోకి దిగాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త విధానం భారత ఐటీ ఉద్యోగులకు దుర్వార్త కానుంది. అమెరికన్ నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగావకాశాలు దగ్గర చేయాల్సి వుందని అభిప్రాయపడ్డ ఆయన హెచ్-1బి వీసాలపై దేశంలోకి వస్తున్న వారి కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే పలు కంపెనీలు తక్కువ ధరకు లభిస్తున్న విదేశీ ఉద్యోగుల జోలికి వెళ్లకుండా, అమెరికన్లకు ఉపాధిని దగ్గర చేస్తాయన్నది ఆయన ఆలోచన. తన ఆలోచనలు అమలైతే, నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని, ఇండియాతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు. హెచ్-1బీ వీసాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఫ్లోరిడా సెనెటార్ మార్కో రుబియోలు చేసిన డిమాండ్ ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దేశం చేపట్టాల్సిన ఇమిగ్రేషన్ సంస్కరణల్లో కనీస వేతన పెంపు ముఖ్యమైనదని డొనాల్డ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News