: రాష్ట్రపతి సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూత


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 10.51 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 7న ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించారు. సెప్టెంబర్ 17, 1940లో జెస్సోర్ లో జన్మించిన శుభ్రా, ప్రణబ్ ను జులై 13, 1957లో వివాహం చేసుకున్నారని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో తెలిపారు. ఆమె మంచి గాయని అని 'గీతాంజలి ట్రూప్'ను కూడా నెలకొల్పారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News