: సరికొత్త ఆవిష్కరణ, పారదర్శక స్మార్ట్ ఫోన్ వచ్చేసింది!
స్మార్ట్ ఫోన్... అద్దంలా ఉంటుంది. అదేంటి, అన్ని ఫోన్లలో ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే అద్దంలా చూసుకోవచ్చు కదా? అని అడుగుతారా? అలా కాదు. పూర్తి పారదర్శకంగా... అంటే వెనకాల ఉన్న అన్ని వస్తువులనూ చూపే అద్దంలాంటి స్మార్ట్ ఫోన్ అన్నమాట. డిస్ ప్లే, చిప్ సెట్, ప్రాసెసర్ ల నుంచి బ్యాటరీ వరకూ ఏదీ కనిపించదు. ఒక అద్దమే స్మార్ట్ ఫోన్ గా ఉపయోగపడుతుంది. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే మొబైల్స్ విక్రయాలు జరుపుతున్న లెనోవో ఈ సరికొత్త ఆవిష్కరణను విడుదల చేసింది. తాము ఇటీవల విడుదల చేసిన 'జుక్' స్మార్ట్ ఫోన్ సిరీస్ లో భాగంగా దీన్ని తయారు చేశామని లెనోవో వెల్లడించినట్టు చైనా టెక్ పత్రిక 'గిజ్మో' వెల్లడించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుందని, సంప్రదాయ స్మార్ట్ ఫోన్లు చేసే పనులన్నీ చేస్తుందని వెల్లడించిన సంస్థ మరిన్ని వివరాలు, ధర తదితరాలను మాత్రం వెల్లడించలేదు.