: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక 'క్లర్క్'లుండరు!


వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 'క్లర్క్' పేరిట ఉన్న ఉద్యోగాల పేర్లు మార్చాలని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీపీఓటీ) చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఎల్డీసీ (లోయర్ డివిజన్ క్లర్క్), యూడీసీ (అప్పర్ డివిజన్ క్లర్క్) పేర్ల స్థానంలో పరిపాలనా సౌలభ్యం మెరుగయ్యేలా, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గా పిలవాలని డీపీఓటీ ప్రతిపాదనలు పంపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో అన్ని శాఖలకూ వచ్చే నెల 18లోగా సలహాలు, సూచనలు తెలియజేయాలని విజ్ఞప్తి చేసిన కేంద్రం, ఆపై పేర్ల మార్పు గురించి అధికారిక ప్రకటన వెలువరించవచ్చని తెలుస్తోంది. దీంతో పాటు సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను వర్గీకరణ జరపాలని, క్లాస్ 1, 2, 3, 4గా ఉద్యోగులను, ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా డీనోటెడ్ చేయాలని కూడా కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News