: హుజీ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్... ఓ పాస్ పోర్టు ఏజెంట్ కూడా!


హైదరాబాదులో నిషేధిత ఉగ్రవాద సంస్థ హుజీ మూలాలు బలంగానే ఉన్నట్లు ఆధారాలు లభ్యమతువుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు దాడులకు పక్కా స్కెచ్ వేసిన నలుగురు ఉగ్రవాదులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు సహకరించారన్న ఆరోపణలతో కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బషీర్ తో పాటు మరో కానిస్టేబుల్ సలీం కూడా ఉగ్రవాదులకు సహకరించారని తేలింది. పాస్ పోర్టు ఏజెంటుగా వ్యవహరిస్తున్న అన్సారీ కూడా ఉగ్రవాదులకు సహకరించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బషీర్ తో పాటు సలీం, అన్సారీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News