: మూడేళ్లు ఆగండి... నేనే సీఎంనవుతా!: పులివెందులవాసులకు జగన్ భరోసా


నిన్న తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఆసక్తికర ప్రకటన చేశారు. మరో మూడేళ్లలో తాను సీఎం అవుతానని ఆయన ధీమాగా చెప్పారు. ‘‘మరో మూడేళ్లు ఆగండి. ముఖ్యమంత్రిగా నేనే వస్తా. మీ సమస్యలు తీరుస్తా’’ అని ఆయన నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. పులివెందులలోని తన ఇంటిలో నిన్న ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన వద్దకు ఓ మహిళ వచ్చింది. తొండూరు ఎమ్మార్సీలో స్వీపర్ గా పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించారని, తనకు న్యాయం చేయాలని ఆమె జగన్ ను కోరింది. ఈ సందర్భంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అసలు ఈ మూడేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఉండనే ఉండదని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారని జగన్ వ్యాఖ్యానించడం కొసమెరుపు!

  • Loading...

More Telugu News