: చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పిందట!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రయాణించిన హెలికాప్టర్ దారి తప్పిందట. అది కూడా కర్నూలు జిల్లాలోనన్న విషయం అటు భద్రతాధికారులనే కాక టీడీపీ నేతలను సైతం కలవరానికి గురి చేసింది. ఎందుకంటే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ కుప్పకూలింది ఆ జిల్లాలోనే కాబట్టి. నిన్న కర్నూలు, కడప జిల్లాల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తొలుత కర్నూలు జిల్లాకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్ లో కడప జిల్లా బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరిన సదరు హెలికాప్టర్ సరిగ్గా 5.30 గంటలకు కడప చేరుకోవాల్సి ఉంది. అయితే 10 నిమిషాలు ఆలస్యంగా అక్కడ ల్యాండైంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా హెలికాప్టర్ దారితప్పిన విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News