: 'భారత్ మాతా కీ జై' నినాదాలతో హోరెత్తిన దుబాయ్ స్టేడియం


'భారత్ మాతా కీ జై' నినాదాలతో దుబాయ్ క్రికెట్ స్టేడియం హోరెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్ లోని భారతీయుల నుద్దేశించి చేసిన ప్రసంగం వినేందుకు భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. మోదీకి ఘన స్వాగతం పలికిన భారతీయులు జాతీయ గీతాలాపన ముగిసిన వెంటనే 'భారత్ మాతాకీ...' అని మోదీ అనగానే, 'జై' అంటూ స్టేడియం ను హోరెత్తించారు. తాను ఇక్కడ లఘు భారత దేశాన్ని చూస్తున్నానని పేర్కొన్న మోదీ, దేశం నలుమూలల నుంచి వచ్చిన భారతీయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత దేశాన్ని పాలకులు నట్టేట ముంచి ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంటే, వాజ్ పేయి ఆదుకున్నట్టు, ప్రపంచంలోని ఎన్నారైలు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News