: మూడు గంటలుగా రన్ వేపై నిలిచిన విమానం... పైలెట్ కోసం వెయిటింగ్!


చెన్నై నుంచి హైదరాబాదు రావాల్సిన ఎయిరిండియా ఏఐ-545 విమానం చెన్నై విమానాశ్రయంలోని రన్ వేపై మూడు గంటలుగా నిలిచిపోయింది. ఈ విమానంలో హైదరాబాదు చేరేందుకు 300 మంది ప్రయాణికులు బయల్దేరారు. కాగా, పైలట్ రాకపోవడంతో విమానం రన్ వేపై నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎయిరిండియా పైలట్ ల సమయపాలన, క్రమశిక్షణా రాహిత్యంపై ఎన్నో ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News