: స్పిన్నర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడి పనికిరాదు: ద్రావిడ్


గాలే టెస్టులో టీమిండియా దారుణ భంగపాటుపై భారత్-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. స్పిన్నర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగడం సరికాదని హితవు పలికాడు. స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కోవాలని సూచించాడు. సహనంతో ఆడితే సత్ఫలితాలు సాధించవచ్చని, కొన్ని సందర్భాల్లో సరైన బంతిని గౌరవించడం కూడా అవసరమేనని తెలిపాడు. ముఖ్యంగా, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫుట్ వర్క్ ఉపయోగపడుతుందని సూచించాడు. వీవీఎస్ లక్ష్మణ్ పరిమిత స్థాయిలో పాదాలు కదిలిస్తూ స్పిన్ ను బాగా ఆడేవాడని ద్రావిడ్ వివరించాడు. స్వీప్ షాట్ ఆడకపోయినా, ఆన్ డ్రైవ్ లతో అలరించేవాడని తెలిపాడు. ఇక, సౌరవ్ గంగూలీ అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్లపై ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడికి దిగేవాడని, మెరుగైన ఫుట్ వర్క్ తోనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News