: ఓటుకు నోటు కేసులో మరో ముగ్గురికి ఏసీబీ నోటీసులు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురికి టీఏసీబీ నోటీసులు ఇచ్చింది. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడికి ఏసీబీ నోటీసు పంపింది. ఆతనితో పాటు చైతన్య, విష్ణు అనే మరో ఇద్దరు వ్యాపారులకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు ఏసీబీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. శ్రీనివాసులు ప్రస్తుతం కర్ణాటకలోని ఓ బెవరేజెస్ కంపెనీకి ఎండీగా ఉన్నారు.