: సోషల్ మీడియా సాయంతో యువతపై 'టెర్రర్' వల


అతడో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ కుమారుడు... పేరు బుర్హాన్ వనీ. జమ్మూకాశ్మీర్ లో హిజ్ బుల్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థకు రీజనల్ కమాండర్. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది. ఇప్పుడా కరుడుగట్టిన టెర్రరిస్టు సోషల్ మీడియా సాయంతో యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తుపాకులు చేతబట్టి ఎంతో ఆనందంగా కనిపిస్తున్న జిహాదీల ఫొటోలను, వీడియోలను ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్ లో పోస్టు చేస్తూ యువకులకు గాలం వేస్తున్నాడు. ఆ ఫొటోలు, వీడియోల్లో కనిపించే తీవ్రవాదులు ముఖాలకు ముసుగులు లేకుండా దర్శనమివ్వడం గమనార్హం. బుర్హాన్ పేరిట పలు వెబ్ సైట్లు, ఫ్యాన్ పేజీలు కూడా ఆన్ లైన్లో దర్శనమిస్తుంటాయి. వీటి ద్వారా కూడా ఉగ్రవాద ప్రచారం చేస్తూ బుర్హాన్ తన భారత వ్యతిరేకతను చాటుకుంటుంటాడు. రిస్క్ లేని ఉపాధి అని, హీరోయిజం అని యువతపై టెర్రర్ వల విసిరేందుకు ప్రయత్నిస్తున్న బుర్హాన్ కోసం భారత దళాలు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News