: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చురేపిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై న్యాయవాది పీవీ కృష్ణయ్య ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు కేసులతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల కేసులను సీబీఐకి అప్పగించాలని అందులో కోరారు. పునర్విభజన చట్టంలో సెక్షన్ 8 ఏం చెబుతుందో స్పష్టం చేస్తూ ప్రకటన జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈరోజు ధర్మాసనం ముందుకు వ్యాజ్యం వచ్చాక పిటిషన్ అర్హతను ధర్మాసనం ప్రశ్నించింది. ఇది అర్హమైందో కాదో తేల్చేందుకు న్యాయస్థానానికి లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని పిటిషనర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.