: గ్రామజ్యోతితో ఒరిగేదేమీ లేదు: గుత్తా
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంపై నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పెదవి విరిచారు. ఈ పథకం వల్ల పైసా ఉపయోగం లేదని, జనాలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని... రానున్న రోజుల్లో ఈ పథకానికి ఒక్క పైసా కూడా విడుదల చేయరని జోస్యం చెప్పారు. గతంలో కూడా ఇలాగే అట్టహాసంగా నిర్వహించిన సమగ్ర సర్వే, మన ఊరు-మన ప్రణాళికలు మూలన పడ్డాయని ఎద్దేవా చేశారు.