: జ్ఞాపకశక్తిని ఇలా మెరుగు పరుచుకోండి!


రోజువారీ విషయాలను కూడా గుర్తుంచుకునేందుకు కొంత మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకునేందుకు అమెరికాలోని నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు చక్కని చిట్కా చెబుతున్నారు. సుడోకు, క్రాస్ వర్డ్స్ ఆడితే జ్ఞాపక శక్తి మెరుగవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అవి ఆడడం చాలా మందికి చికాకుగా ఉంటుంది. అలాంటి వారు పచ్చని వాతావరణంలో వుండే పొడుగైన చెట్లెక్కాలని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లెక్కితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చెట్లెక్కడం వల్ల 50 శాతం జ్ఞాపక శక్తి మెరుగవుతుందని వారు సూచిస్తున్నారు. పుట్ బాల్, టెన్నిస్, స్క్వాష్ ఆడేవారిలో కూడా ఇదే రకమైన జ్ఞాపక శక్తి పెరుగుతుందని వారు గుర్తించారు. దీంతో చెట్లెక్కడం, చెట్లెక్కుతూ రివర్స్ లో అంకెలు లెక్కబెట్టడం, సన్నని కర్రమీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం, ఫుట్ బాల్, టెన్నిస్, స్క్వాష్ వంటి ఆటలాడడం ప్రాక్టీస్ చేయాలని, అలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News