: కేసీఆర్ కు పండుగలు, శంకుస్థాపనలు తప్ప ప్రజా సమస్యలు పట్టవు: బీజేపీ నేత యెన్నం


తెలంగాణ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన బీజేపీ నేత యెన్నం శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కు పండుగలు, శంకుస్థాపనలు తప్ప ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టవని ఆరోపించారు. అసలు గ్రామజ్యోతి కార్యక్రమం ఎందుకు పెట్టారో ప్రభుత్వానికే తెలియదని ఎద్దేవా చేశారు. దానికంటే ముందు ప్రారంభించిన 'మన ఊరు' ప్రణాళికను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 'హరితహారం' కార్యక్రమంలో 10 శాతం మొక్కలు కూడా నాటలేదన్నారు. ఈ ప్రభుత్వంపై పోరాటానికే తెలంగాణ బచావో మిషన్ ప్రారంభిస్తున్నామని యెన్నం చెప్పారు.

  • Loading...

More Telugu News