: రాజధాని కోసం ఈ నెల 20 నుంచి మరోసారి భూసేకరణ: నారాయణ


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటి వరకు 95 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. కొందరు రైతులు అభ్యంతరం వెలిబుచ్చిన నేపథ్యంలో, పూలింగ్ ఆగిపోయిందని చెప్పారు. మిగిలిన ల్యాండ్ పూలింగ్ ను ఈ నెల 20 నుంచి మళ్లీ ప్రారంభిస్తామని... ఈ విడత అవసరమైన భూమినంతటినీ సేకరిస్తామని చెప్పారు. భూసేకరణకు సంబంధించి కోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి విపక్షాలు రాద్ధాంతం చేయరాదని కోరారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాపై చర్చిస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News