: 100 శాతం ప్లేస్ మెంట్స్ సాధించిన భారత విద్యాసంస్థ ఇదే!


మహిళా పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మజుందార్ షా చీఫ్ మెంటార్ గా ఉన్న బయోకాన్ అకాడమీ ఈ సంవత్సరం 100 శాతం ప్లేస్ మెంట్స్ సంపాదించుకుంది. 2013లో ప్రారంభించిన అకాడమీలో మూడు, నాలుగు బ్యాచ్ లలో 30 మంది చొప్పున గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, వారికి కిరణ్ స్వయంగా పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, తమ సంస్థలో చదివిన 120 మంది విద్యార్థులకు ప్రొడక్షన్, క్వాలిటీ, రెగ్యులేటరీ అఫైర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయని తెలిపారు. బయోటెక్నాలజీ విభాగంగా గ్రాడ్యుయేషన్ విద్యను అందిస్తున్నామని, వీరంతా ఈ రంగంలో నిష్ణాతులుగా తయారై పరిశ్రమకు అందివచ్చారని తెలిపారు. ప్రస్తుతం తాము మరిన్ని కొత్త కోర్సులను అందించాలని నిర్ణయించామని, వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బయోకాన్ అకాడమీకి ఎడ్యుకేషన్ భాగస్వామిగా కాలిఫోర్నియాకు చెందిన కెక్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ను ఎంపిక చేసుకున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News