: ఓ చిత్రం అంగీకరించాక ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు: అనిల్ కపూర్
బాలీవుడ్ లో మీసంతో స్క్రీన్ పై కనిపించే అతి కొద్దిమంది నటుల్లో అనిల్ కపూర్ ఒకరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ గురించి మాట్లాడారు. ఓ సినిమా అంగీకరించాక ఎన్నడూ వెనుదిరిగి చూడలేదని అన్నారు. నటనా వృత్తి చాలా కష్టమైనదని, తగిన సహకారం ఉంటే లైఫ్ ఈజీగా ముందుకెళుతుందని అభిప్రాయపడ్డారు. తన కుటుంబం సహకరించడంతో కెరీర్ ఆనందంగా నడుస్తోందని వివరించారు. కెరీర్లో ఇప్పుడు తనకు మహర్దశ నడుస్తోందని తెలిపారు.