: 'ఆషికీ 2' సినిమా గాయకుడికి మాఫియా డాన్ బెదిరింపులు
బాలీవుడ్ మ్యూజికల్ హిట్ 'ఆషికీ 2' సినిమాలో 'తుమ్ హి హో' పాటను ఆలపించిన అరిజీత్ సింగ్ కు మాఫియా డాన్ రవి పూజారి బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో షారూఖ్ ఖాన్, ప్రీతి జింటాను బెదిరించిన మాఫియా డాన్ రవి పూజారి ఈసారి వర్ధమాన గాయకుడు అరిజీత్ సింగ్ ను బెదిరించడం విశేషం. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని అరిజీత్ సింగ్ ను రవి పూజారి డిమాండ్ చేశాడు. అంత డబ్బు తానిచ్చుకోలేనని అరిజీత్ సింగ్ చెప్పుకోవడంతో, కొన్ని షోలు చేసిపెట్టాలని సూచించాడట. దీనిపై అరిజీత్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయనప్పటికీ, ఆతని మేనేజర్ మాత్రం పోలీసులకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, మాఫియా డాన్ లు బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యం చేసుకుని బెదిరింపులకు దిగి, వసూళ్లకు పాల్పడడంపై ఎంతో కాలంగా ఆరోపణలు ఉన్నాయి.