: సాక్ష్యాలు తారుమారు చేశారంటూ, గోవా మాజీ సీఎం కామత్ పై కేసు


లూయిస్ బర్గర్ లంచాల కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ పై కేసు నమోదైంది. ఈ కేసులో కీలకమైన ఫైళ్లను వెతుకుతున్న గోవా క్రైమ్ బ్రాంచ్ ఈ కేసు పెట్టగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలు మాయం చేయడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు పెట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఆయనపై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 8, 9, 13ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజన్సీ (జికా) నిధులతో తలపెట్టిన నీటి నిర్వహణ ప్రాజెక్టును పొందేందుకు యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న లూయిస్ బర్గర్ సంస్థ గోవా ప్రభుత్వంలోని వారికి లంచాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News