: లలిత్ మోదీకి చెందిన రెండు సింగపూర్ బ్యాంక్ ఖాతాల నిలుపుదల
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కేసు విషయంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయనకు చెందిన రెండు సింగపూర్ బ్యాంక్ ఖాతాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీల్ చేసినట్టు తెలిసింది. మీడియా కథనాల ప్రకారం, లలిత్ కు ఎక్కడెక్కడ ఖాతాలున్నాయో ఈడీ అధికారులు తెలుసుకున్నారట. ఆ వెంటనే సింగపూర్ అధికారులను సంప్రదించి అతని ఖాతాల్లోని డబ్బును తిరిగి భారత్ కు పంపాలని కోరారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని సమాచారం.