: మొఘల్ చక్రవర్తి షాజహాన్ బాటలో యూపీ రిటైర్డ్ పోస్టుమాస్టర్


ప్రపంచంలోని అతి గొప్ప కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటి. అది భారత్ లో ఉందని మనం గర్వంగా చెప్పుకుంటాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృత్యర్థం నిర్మించిన ఆ చారిత్రక సౌధం నేటికీ ప్రేమకు చిహ్నంలా విలసిల్లుతోంది. ఇప్పుడా మొఘల్ చక్రవర్తి బాటలోనే ఉత్తరప్రదేశ్ లో ఓ రిటైర్డు పోస్టుమాస్టర్ కూడా భార్య జ్ఞాపకార్థం మినీ తాజ్ మహల్ నిర్మిస్తున్నారు. బులంద్ షహర్ లో ఫైజుల్ హసన్ కదారీ (77) పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైరయ్యారు. అయితే, ఆయన భార్య తజాములీ బేగం 2011 డిసెంబర్ లో కన్నుమూసింది. ఆమెపై తనకున్న ప్రేమను చాటాలని బలంగా నిశ్చయించుకున్న కదారీ, తన సేవింగ్స్ డబ్బులతో మినీ తాజ్ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రస్తుతం చాలా వరకు నిర్మాణం పూర్తయింది. తుదిరూపు సంతరించుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఇప్పుడీ నిర్మాణం బులంద్ షహర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News