: కేసీఆర్ పూల దండలు ఎందుకు వేయించుకోరో మీకు తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూల దండలు వేయించుకోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఏ కార్యక్రమానికి హాజరైనా ఆయన పూల దండలు వేయించుకోవడం మనం దాదాపుగా చూసి ఉండం. దీని వెనకున్న కారణాన్ని గంగదేవిపల్లి సభలో ఈ రోజు ఆయన స్వయంగా వెల్లడించారు. పూలు వాడిపోరాదనే ఉద్దేశంతో వాటిపై నీళ్లు చల్లుతారని... దీంతో, పూల దండలు వేయించుకుంటే చొక్కా తడిసిపోతుందని... అందుకే తాను పూల దండలు వేయించుకోనని కేసీఆర్ వివరణ ఇచ్చారు.