: ఏపీలో జోనల్ విధానాలను రద్దు చేయాలనుకుంటున్నాం: మంత్రి యనమల
ఆంధ్రప్రదేశ్ లో జోనల్ విధానాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. 371డి ఆర్టికల్ సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కొత్త రాజధానిలో అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వచ్చేలా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రానికే జోనల్ వ్యవస్థ వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రం విడిపోయింది గనుక దానిపై మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని యనమల పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారికి కొన్ని వెసులుబాటులు కల్పించాల్సిన అవసరం ఉందన్న మంత్రి, అవసరమైతే అందుకోసం జోనల్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు.