: రూ. 1.7 లక్షల కోట్లతో 250 ఎయిర్ బస్ విమానాలకు ఆర్డరిచ్చిన ఇండిగో


భారత్ కేంద్రంగా బడ్జెట్ ఎయిర్ లైన్ సేవలందిస్తున్న ఇండిగో, ఏ320 నియో ఎయిర్ క్రాఫ్ట్ రకానికి చెందిన 250 విమానాలు కొనాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ తో డీల్ ను కుదుర్చుకుంది. విమానాల సంఖ్య పరంగా ఇదే అతిపెద్ద డీల్. మొత్తం 26.55 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.7 లక్షల కోట్లు) చెల్లించేందుకు ఇండిగో అంగీకరించింది. ఈ ఒప్పందంపై ఇరు కంపెనీల మధ్యా సంతకాలు జరిగాయని తెలుస్తోంది. ఇండియా పౌరవిమానయాన రంగంలో శరవేగంగా విస్తరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకుంటూ పోతున్న ఇండిగో, తన దీర్ఘకాల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏ 320 కుటుంబంలో 530 విమానాలు కొనాలని నిర్ణయించింది. ప్రస్తుతం తమకు ఇండిగో అతిపెద్ద కస్టమర్ అని చెప్పిన ఎయిర్ బస్ ప్రతినిధి ఒకరు, మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా, ఇండొనేషియాకు చెందిన లయన్ ఎయిర్ సంస్థలకు తాము విమానాలు తయారు చేసి ఇస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News