: ఇక్కడ తీసిన చమురు ఇక్కడే వాడాలి: కొనకళ్ల


ఏపీలోని కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి వెలికి తీసిన చమురును... తొలుత రాష్ట్రంలోని సంస్థలకే వినియోగించాలని మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ డిమాండ్ చేశారు. ఇక్కడి అవసరాలు తీరాకే చమురును ఇతర ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఇక్కడి అవసరాలు తీరకుండా చమురును తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని కోరారు. కృష్ణా జిల్లా పెడనలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సులో ప్రసంగిస్తూ కొనకళ్ల నారాయణ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News