: ఇంగ్లిష్ మీడియంలోనే చదవండి: కేసీఆర్
విద్యార్థులు తెలుగు మీడియంలో కన్నా ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్ల మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ మధ్యాహ్నం వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పట్టును సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాధాన్యతల వారీగా గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమస్యలు ఏమున్నాయన్న విషయాన్ని గుర్తిస్తామని, గ్రామజ్యోతి పథకానికి రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో అందరూ ఏకతాటిపై నడవాలని, వ్యతిరేక శక్తుల గురించి ఎవరూ పట్టించుకోవద్దని అన్నారు.