: కనిపించేది క్రికెట్ స్టేడియం, చూసేది 50 వేల మంది, ఆడేది మోదీ ఒక్కడే!


అది దుబాయ్ క్రికెట్ స్టేడియం. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికైంది. భారత్, పాకిస్థాన్ దేశాలకు తటస్థ వేదికగా ఎన్నో మ్యాచ్ లు ఇక్కడ జరిగాయి. షార్జా కప్ పోటీలూ జరిగాయి. సుమారు 50 వేల మందికి పైగా వీక్షకులు కూర్చునేందుకు వీలున్న ఆ స్టేడియం నేడు అరుదైన సమావేశానికి వేదికగా నిలవనుంది. యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అదే స్టేడియంలో తన 'వాక్చాతుర్యపు ఆట' ఆడనున్నారు. ఇప్పటికే అమెరికాలోని, మాడిసన్ స్క్వేర్, ఆస్ట్రేలియాలోని అల్ఫోన్స్ స్టేడియంలలో ఆహూతులను తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేసిన మోదీ, నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియం వేదికగా, అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రాత్రికి జరిగే సమావేశానికి వస్తామని చెబుతూ, ఇప్పటికే 50 వేల మంది అరబ్ దేశాల్లోని భారతీయులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు యూఏఈ అధికారులు వెల్లడించారు. యూఏఈ తనకు రెండో భారతదేశమని ఇప్పటికే వ్యాఖ్యానించిన మోదీ, కిటకిటలాడే స్టేడియంలో భారతీయులను ఉద్దేశించి, ఈ సభలో ఏం మాట్లాడతారన్న విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News