: ఎన్సీపీ ఎమ్మెల్యే అరెస్ట్
అవినీతి ఆరోపణలతో మహారాష్ట్రలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే రమేష్ కదమ్ అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్ర సీఐడీ పోలీసులు రమేష్ కదమ్ ను అదుపులోకి తీసుకున్నారు. జులై నెలలో అన్నభావు సాథే డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకల్లో రమేష్ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. రమేష్ కదమ్ షోలాపూర్ లోని మహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.