: రాధేమాను వెనకేసుకొస్తున్న గాయకుడు సోనూ నిగమ్... అభ్యంతరకర వ్యాఖ్యలు
పలు వివాదాల్లో కూరుకుపోయిన స్వయం ప్రకటిత దేవత రాధేమాకు మరో మద్దతుదారు గాయకుడు సోనూ నిగమ్ రూపంలో దొరికాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. రాధేమా ధరించిన కురచ దుస్తుల కన్నా, బొమ్మల్లో కాళికా మాత ధరించే దుస్తులు మరింత పొట్టిగా ఉంటాయి కదా? అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన ట్వీట్ చేశాడు. ఓ మహిళ ధరించే దుస్తుల గురించి మాట్లాడుకోవడం విడ్డూరమని అన్నాడు. మగ సాధువులు నగ్నంగా తిరుగుతూ, నృత్యాలు చేస్తే పట్టించుకోరని, వారిపై అత్యాచార కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు. పురుషులను, మహిళలను దేవుళ్లు, దేవతలుగా చిత్రిస్తున్న వారిని తొలుత ఆపాలని, వారిపై కేసులు పెట్టాలని అన్నాడు. సోనూ నిగమ్ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది.