: ఖానాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆనంద్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక ఊరిని దత్తత తీసుకోవాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖానాపూర్ గ్రామాన్ని ఆనంద్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖానాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ రోజు నుంచి గ్రామజ్యోతి కార్యక్రమం అధికారికంగా అమలు కానుంది.