: హైకోర్టుకు మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థుల లేఖ... తమ పాఠశాలకు ఒక్క టీచర్ కూడా రావడం లేదని ఫిర్యాదు
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాశారు. 200 మంది విద్యార్థులున్నా ఒక్క టీచర్ కూడా పాఠశాలకు రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోర్టును కోరారు. లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన న్యాయస్థానం, డీఈవోను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. టీచర్లు ఉన్నా రాకుంటే తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.