: కొత్త ఐఏఎస్ అధికారులకు కొత్త రూల్
శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులకు కొత్త నిబంధన విధించారు. ఐఏఎస్ లు ఇప్పటిదాకా ట్రైనింగ్ పూర్తి కాగానే వారికి కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం... ట్రైనింగ్ పూర్తి కాగానే రాష్ట్రాలకు వెళ్లకుండా, కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా మూడు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ పనితీరు, పథకాల వివరాలు, వాటి అమలు తదితర అంశాలపై కొత్త ఐఏఎస్ లకు అవగాహన ఏర్పడుతుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు.