: అధికారులను బంధించి, గ్రామజ్యోతిని బహిష్కరించిన ఎంపీటీసీలు


టీఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకాన్ని ఎంపీటీసీలు బహిష్కరించారు. అంతేకాకుండా, అధికారులను ఎంపీడీఓ కార్యాలయంలో బంధించి నిరసన తెలిపారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో జరిగింది. షెడ్యూల్ ప్రకారం అధికారులు గ్రామాలకు వెళ్లి గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఈ కార్యక్రమంలో తమకు స్థానం కల్పించకుండా, తమ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తూ ఎంపీటీసీలు గ్రామజ్యోతిని బహిష్కరించారు. బందీ అయిన వారిలో ఎంపీడీఓ, ఏఓ, ఎంఈఓ, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వోలు, కార్యదర్శులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి... ఎంపీటీసీలకు సర్ది చెప్పి తాళం తెరిపించారు. అయితే, తమను బంధించడాన్ని అవమానంగా భావించిన అధికారులు కార్యాలయం నుంచి బయటకు రాకుండా... లోపలే సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News