: మోదీకి శాకాహార విందు భోజనం తయారీ కోసం చెఫ్ సంజీవ్ కపూర్ ను ఆహ్వానించిన అరబ్
నరేంద్ర మోదీ, పూర్తి శాకాహారి. మరి యూఏఈలో ఎవరికీ ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న పెట్టుబడుల సంస్థ 'అబూదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ' మోదీ కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది. దీనికి అరబ్ యువరాజు, ఆయన సోదరులు, ప్రభుత్వ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వీఐపీలు హజరయ్యారు. మోదీ కోసం ఒక్క నాన్ వెజ్ వంటకం కూడా లేకుండా చూడాలని నిర్వాహకులు భావించారు. గెస్ట్ లకు స్పెషల్ వెజ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. వంటకాల తయారీ కోసం భారత ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ను ఆహ్వానించారు. దీంతో ఆయన నిన్న ఆగమేఘాల మీద యూఏఈ వెళ్లి ఈ పనులను స్వయంగా పరిశీలించి విందును విజయవంతం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.