: స్టూవర్ట్ బిన్నీ... శ్రీలంకకు వచ్చేసెయ్!: బీసీసీఐ అర్జంట్ కాల్
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో విజయం ముంగిట నిలిచి ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆల్ రౌండర్ అవసరం జట్టుకు తెలిసివచ్చింది. శ్రీలంకకు వెంటనే బయలుదేరి రావాలని స్టూవర్ట్ బిన్నీకి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. రెండో టెస్టు ప్రారంభానికి ముందే బిన్నీ జట్టును చేరుకుంటాడని బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బిన్నీని అత్యవసరంగా లంకకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రెండో టెస్టులో బిన్నీకి స్థానం ఉన్నట్టేనని అంచనా. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందని భావిస్తున్న మేనేజ్ మెంట్ బిన్నీ రాకతో జట్టు బలపడుతుందని భావిస్తోంది. హర్భజన్ స్థానంలో బిన్నీని తుది జట్టులో ఆడించవచ్చని సమాచారం.