: సొంతూరుపై ‘యశోద’ పుత్రుల మమకారం... రూ.60 లక్షల విరాళం


హైదరాబాదు నగరంలో ప్రైవేట్ వైద్య రంగంలో మెరుగైన సేవలందిస్తున్న ‘యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ యాజమాన్యం దాతృత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్ కు చెందిన గొరుకంటి యశోద, రాంచందర్ రావు (పేష్కారి) దంపతుల నలుగురు కొడుకులు రవీందర్ రావు, సురేందర్ రావు, నరేందర్ రావు, దేవేందర్ రావులు ఉన్నత చదువులు చదివి ఉమ్మడిగానే తల్లి పేరిట ‘యశోద’ ఆసుపత్రిని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనూ ఓ ప్రముఖ ఆసుపత్రిగా ఎదిగింది. అసలు విషయానికొస్తే... గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతోంది. కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలు ఈ పథకంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ‘యశోద’ సోదరులు తమ సొంతూరు అభివృద్ధికి ఏకంగా రూ.60 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాక గ్రామంలో ఇప్పటికీ తమకు ఉన్న 11 ఎకరాల 30 గుంటల సాగు భూమి, 30 గుంటల స్థలంలో ఉన్న పెంకుటిల్లును కూడా ప్రభుత్వానికి అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ కు భూమి పత్రాలతో పాటు విరాళం చెక్కును ‘యశోద’ సోదరులు అందించనున్నారు.

  • Loading...

More Telugu News