: ఇచ్చిన నిధులకు లెక్కచెప్పండి... తెలంగాణకు షాకిచ్చిన కేంద్రం
ఇప్పటికే పలు అంశాలపై కొత్త రాష్ట్రం తెలంగాణకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం... తాజాగా నిన్న కాస్తంత కఠినంగా మరో అంశంపై లేఖ రాసింది. ఇప్పటిదాకా తాము విడుదల చేసిన నిధులకు సంబంధించిన లెక్కలు చెప్పాలంటూ లేఖాస్త్రం సంధించింది. అంతేకాక సదరు లెక్కలు చెప్పేదాకా ఇకపై నిధుల విడుదల కుదరదని కూడా తేల్చిచెప్పేసింది. ‘‘మేమిచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పండి. ఆ లెక్కలు అందిన తర్వాతే కొత్తగా ఇవ్వాల్సిన నిధులను మంజూరు చేస్తాం’’ అని ఆ లేఖలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్రం లేఖతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలను సేకరించడంలో నిమగ్నమైంది.