: తెలంగాణలో గ్రామజ్యోతికి నేడే శ్రీకారం... గంగదేవిపల్లిలో ప్రారంభించనున్న కేసీఆర్


గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘గ్రామజ్యోతి’ నేడు ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ఈ పథకాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రానున్న నాలుగేళ్లలో దాదాపు రూ.25వేల కోట్ల నిధులను ఈ పథకం కింద ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, ఈ ఏడాది కనీసం రూ.5 వేల కోట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తెలంగాణ మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News