: యూఏఈలో మోదీకి గ్రాండ్ వెల్ కమ్... ఐదుగురు సోదరులతో కలిసి స్వాగతం పలికిన యువరాజు


అరబ్ దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈలో నిన్న ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు సహా ఏ దేశాధినేతకూ లభించని గ్రాండ్ వెల్ కమ్ మోదీ అందుకున్నారు. యూఏఈ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాల్ తన ఐదుగురు సోదరులతో కలిసి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. ఇలా సోదరులందరితో కలిసి వచ్చి యువరాజు ఏ దేశాధినేతకు కూడా స్వాగతం పలికిన సందర్భాలు లేవట. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధానికి ఆ తరహా స్వాగతం లభించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

  • Loading...

More Telugu News