: ఆ 50 లక్షలు ఎక్కడివి?.... నేటికీ టీ-ఏసీబీకి అంతు చిక్కని వైనం!


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసు బాధ్యతలను చేపట్టిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖాధికారులకు నేటికీ కొన్ని విషయాలు నిద్ర పట్టనివ్వడం లేదు. ఈ కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులను ఏసీబీ అధికారులు లోతుగా విచారించారు. అయినా కొన్ని విషయాల్లో మిస్టరీని ఛేదించేందుకు ఆ శాఖ అధికారులు చేస్తున్న యత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ముట్టజెబుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం మాత్రం ఏసీబీకి బోధపడటం లేదు. కేసులో కీలక నిందితులుగా పరిగణిస్తున్న జెరూసలెం మత్తయ్య, జిమ్మిబాబు, కొండల్ రెడ్డి తదితరులు విచారణకు సహకరించకపోవడం లాంటి కొన్ని కారణాలు కూడా ఏసీబీ అధికారుల ముందరి కాళ్లకు బంధాలేస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు పలుమార్లు మాట్లాడిన వ్యక్తులకు కూడా నోటీసుల జారీకి రంగం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News