: లాస్ ఏంజిలెస్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రవీనా టాండన్ కు చేదు అనుభవం


బాలీవుడ్ సినీ నటి రవీనా టాండన్ కు లాస్ ఏంజిలెస్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైంది. తనకు జరిగిన అనుభవం గురించి రవీనా టాండన్ ట్విట్టర్లో తెలిపింది. లాస్ ఏంజిలెస్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపింది. అయితే తనతోపాటు స్టేజిపై ఉన్న ఓ వ్యక్తి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆ సమయంలో ఆ వ్యక్తి పూటుగా తాగి ఉన్నాడని తెలిపింది. ఆ వ్యక్తి పిల్లలను తన కారులో తీసుకురాలేదన్న అక్కసుతో ఆ వ్యక్తి అలా ప్రవర్తించాడని రవీనా వెల్లడించింది. తాను సహనంతో మాట్లాడినా ఆ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడని, ఆ వ్యక్తి పిల్లలను తన కారులో తెచ్చేందుకు సెక్యూరిటీ, ప్రోటోకాల్ సహకరించలేదని ఆమె తెలిపారు. దీనిని స్టేజిపై ఉన్న ఇతరులకు చెప్పగా, ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారని, దీంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగినా మూడ్ ఆఫ్ అయిందని రవీనా టాండన్ పేర్కొంది.

  • Loading...

More Telugu News