: హీరోయిన్లు స్నేహంగా ఎందుకుండరో తెలుసా?: జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య సఖ్యత ఉండకపోవడానికి కారణం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలిపింది. శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. భంగిస్థాన్ సినిమా విజయోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, అభద్రతా భావం కారణంగా తోటి హీరోయిన్లతో స్నేహంగా మెలగలేకపోతే, ఇంకెవరితోనూ స్నేహంగా మెలగలేరని తెలిపింది. తనకు అభద్రతా భావం లేదని, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతానని జాక్వెలిన్ తెలిపింది. సోనమ్ కపూర్ లాగే తాను కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటానని చెప్పింది. అందుకే సోనమ్ అంటే ఇష్టమని జాక్వెలిన్ చెప్పింది. త్వరలోనే ముంబైలో రెస్టారెంట్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు జాక్వెలిన్ తెలిపింది. శ్రీలంకలో ఓ హోటల్ నడుపుతున్నానని తెలిపిన జాక్వెలిన్, భారత్, శ్రీలంక ఆహార అభిరుచులు ఒకేలా ఉంటాయని చెప్పింది. శ్రీలంక రుచులను భారత్ లో అందిస్తానని జాక్వెలిన్ పేర్కొంది.