: వయసు గురించి బెంగలేదు: సైఫ్ అలీ ఖాన్


వయసు గురించి బెంగలేదని బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. 45వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ కు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. నివాసంలో నిరాడంబరంగా పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, 45 ఏళ్ల వయసును గొప్ప వయసుగా భావిస్తున్నానని తెలిపాడు. మరోపక్క, గతంలో సైఫ్ తో తీసుకున్న ఫోటోను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేస్తూ ఇలియానా శుభాకాంక్షలు చెప్పింది. కాగా, భార్య కరీనా, ఇతర నటీ నటులు సైఫ్ అలీ ఖాన్ కు శుభాకాంక్షలు చెప్పారు.

  • Loading...

More Telugu News