: కొండపై కూలిన విమానం...శకలాలు గుర్తింపు
ఇండోనేసియాలోని రాడార్ కు అందకుండా పోయిన విమానం ఆచూకీ తెలిసింది. పుపువా ప్రాంతంలోని కొండపై విమానం కూలినట్టు స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో గాలింపు చర్యలు నిలిపివేసిన అధికారులు, ఒక్తాబెలో విమాన శకలాలను గుర్తించారు. విమానం కూలినప్పుడు అందులో ఐదుగురు సిబ్బంది, ఐదుగురు చిన్నపిల్లలు సహా 54 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. అధికారులు విమాన శకలాల వద్దకు చేరుకునేందుకు సహాయ సిబ్బందిని పంపారు. ఈ మధ్యాహ్నం ఇండోనేసియాకు చెందిన ఈ విమానం ఆచూకీ లేకుండా పోయిన సంగతి తెలిసిందే.