: ప్రత్యేక హోదా వస్తుందో, ప్యాకేజీ వస్తుందో త్వరలోనే తేలిపోతుంది: గంటా
స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సాంకేతిక ఇబ్బందులున్నాయని కేంద్రం తెలిపిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖపట్టణంలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని కేంద్రం చెప్పిందన్నారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీపై కేంద్రం తర్జనభర్జనలు పడుతోందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో, ప్రత్యేకహోదా కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని తెలిపిందని అన్నారు. ప్రత్యేకహోదా వస్తుందో రాదో తెలియదు కానీ, హోదా కంటే మెరుగైన ప్యాకేజీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.