: 10, 20, 100 నోట్లు ముట్టుకుంటే ప్రమాదమా?


కరెన్సీ నోట్ల వల్ల వ్యాధులు కూడా వస్తున్నాయట. నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజమే అంటున్నారు పరిశోధకులు. టీబీ లాంటి భయంకరమైన రోగాలను కరెన్సీ నోట్లు ఒకర్నుంచి మరొకరికి సులువుగా చేరుస్తున్నాయట. తాజాగా జరిగిన పరిశోధనల్లో ఈ వాస్తవం వెల్లడైంది. సీఎన్ఐఆర్, ఐజీఐబీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో కొన్ని నమ్మలేని నిజాలు బహిర్గతమయ్యాయి. కరెన్సీ నోటుపై 70 శాతం ఫంగీ, 9 శాతం బాక్టీరియా, 1 శాతం వైరస్ లు ఉన్నట్టు తేలింది. వీటి కారణంగా చర్మసంబంధ, శ్వాసకోస, జీర్ణవ్యవస్థ, క్షయ వంటి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఢిల్లీలోని కిరాణా షాపులు, టీ దుకాణాలు, చిరు వ్యాపారుల నుంచి సేకరించిన ఒక్కో నోటుపై 78 రకాల బాక్టీరియా చేరి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 10, 20, 100 రూపాయల నోట్లపై ఈ బాక్టీరియా మరీ ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. అందుకే ప్లాస్టిక్ నోట్ల వాడకం మంచిదని వారు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కరెన్సీ వాడకం పెరుగుతోందని, భారత్ లో కూడా ప్లాస్టిక్ కరెన్సీ రావాలని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News