: ఔటర్ రింగు రోడ్డుపై కారు దగ్ధం
హైదరాబాదులోని ఔటర్ రింగు రోడ్డుపై కారు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం దగ్గర ఔటర్ రింగ్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రేగిన సమయంలో ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మంటలు చూసిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో కారు నిలిపేశాడు. ఇద్దరూ వేగంగా స్పందించి, బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగి క్షణాల్లోనే కారును బూడిద చేసేశాయి. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.