: గల్ఫ్ కంట్రీ నాకు మినీ ఇండియా వంటిది!: మోదీ


గల్ఫ్ కంట్రీ తనకు మినీ ఇండియా లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రెండు రోజుల పర్యటనకు యూఏఈ వెళ్లిన సందర్భంగా షార్జాకు చెందిన ఖాలిజ్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అరబ్ దేశాలు భారత్ కు ఎప్పుడూ ముఖ్యమైనవేనని అన్నారు. చాలా సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధాని అరబ్ దేశాల పర్యటనకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో 26 లక్షల మంది భారతీయులు ఉంటున్నారని, అందుకే గల్ఫ్ దేశం తనకు మినీ ఇండియాలా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ కు రక్షణ, ఆర్థికాభివృద్ధిలో గల్ఫ్ పాత్ర మరువలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News